దేశ అవసరాలు తీర్చేటట్టు వ్యాపారాలు ఉండాలి : నిర్మలా సీతారామన్‌‌‌‌

న్యూఢిల్లీ: కంపెనీల వ్యాపారాలు దేశ ఆర్థిక ప్రాధాన్యాతలకు అనుగుణంగా ఉండాలని, స్ట్రాటజిక్ అవసరాలను తీర్చేటట్టు ఉండాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ ఫోరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్నారు. దీనికి తగ్గట్టు బిజినెస్‌‌‌‌లను మార్చుకోవాలని, నేషనల్ ప్రయారిటీని దృష్టిలో పెట్టుకోవాలని గుర్తు చేశారు. సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.  గ్లోబల్ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నా ఇండియాపై ప్రభావం లేకుండా ఉండేటట్టు సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసుకోవాలని కంపెనీలకు  పిలుపిచ్చారు. 

గత పదేళ్లలో  సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్డంకులు ఏర్పడడానికి, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరగడానికి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలే కారణమని సీతారామన్ పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చక్కగా మేనేజ్ చేయడంపై ఫోకస్ పెట్టాలని, అసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించడానికి  అప్పులు చేయొచ్చని, కానీ ఆ అప్పులు తర్వాతి తరానికి భారంగా మారకూడదని  పేర్కొన్నారు.