ముంబై: అదానీ గ్రూప్‌కు చెందిన మరో పెద్ద ఎయిర్‌పోర్ట్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 17 న అందుబాటులోకి రానుంది. కమర్షియల్ విమానాల కోసం ఆదివారం టెస్టింగ్ చేశారు. ఇండిగో ఏ320 ప్యాసింజర్ విమానం రన్‌వే 26/08 పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. తాజా ల్యాండింగ్ సక్సెస్ కావడంతో కమర్షియల్ సర్వీస్‌లను మొదలు పెట్టేందుకు ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందడానికి అదానీ గ్రూప్‌కు వీలుంటుంది.
వచ్చే ఏడాది మే చివరిలో డొమెస్టిక్ సర్వీస్‌లు, జులై చివరి కల్లా ఇంటర్నేషనల్ సర్వీస్‌లను మొదలు పెడతామని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈఓ అరుణ్ బన్సాల్ పేర్కొన్నారు.