బెల్లంపల్లిలో జాతీయస్థాయి కరాటే పోటీలు షురూ

  • 600 మంది క్రీడాకారులు  హాజరు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం నేషనల్ లెవల్ కరాటే, యోగా చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా షురూ అయ్యాయి. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ దేవయ్య జ్యోతి ప్రజ్వలన చేసి గేమ్స్ ప్రారంభించి మాట్లాడారు. 

కరాటే నేర్చుకోవడం ద్వారా  వ్యక్తిగత రక్షణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. నిత్యజీవితంలో యోగా ఆరోగ్యంగా  ఉంచుతుందన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ వెంకటేశ్​ఆధ్వర్యంలో  కొనసాగుతుండగా.. టీ పీసీసీ మెంబర్ చిలుముల శంకర్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు, రిటైర్డ్ సీబీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్, కరాటే మాస్టర్లు శంకర్, రాజేశ్, రవి, నారాయణ, పెద్ద సంఖ్యలో కరాటే, యోగా క్రీడాకారులు  పాల్గొన్నారు.