గజ్వేల్​లో జాతీయ జెండాకు అవమానం

  •     మున్సిపల్ లో తలకిందులుగా పతాకావిష్కరణ 
  •     పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు 

గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా గజ్వేల్​పట్టణంలో గురువారం పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో చైర్మన్​రాజమౌళి గుప్తా తలకిందులుగా జెండా ఎగురవేశారు. పొరపాటును గుర్తించి వెంటనే జెండాను కిందికి దింపి సరిచేసి మరల ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్​కమిషనర్​నర్సయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్​ ప్రతాప్​రెడ్డి, పలువురు ప్రముఖుaలు ఉన్నారు.

కాగా  అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా జాతీయ జెండాకు అవమానం జరిగిందని  బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.