జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ విజేత నస్పూర్ జట్టు

నస్పూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఈ పోటీల్లో మంచిర్యాల జిల్లా నుంచి మొత్తం 12 జట్లు పాల్గొనగా నస్పూర్, బెల్లంపల్లి జట్లు ఫైనల్​కు చేరుకున్నాయి. సోమవారం శ్రీరాంపూర్​లోని కృష్ణ కాలనీ శాంతి స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగ్గా నస్పూర్ జట్టు విజేతగా నిలిచింది.  

విన్నర్స్, రన్నర్స్ జట్లకు అసోసియేషన్ సభ్యులు బహుమతులు అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్ల సతీశ్​, జిల్లా ప్రధాన కార్యదర్శి గని రవీందర్, కోశాధికారి శ్రీపతి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకయ్య గౌడ్,  ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.