30 నిమిషాల్లో మింత్రా డెలివరీ

న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ మింత్రా క్విక్ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అయ్యింది. ‘ఎం–నౌ’ పేరుతో  సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మొదలు పెట్టింది.  ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యూటీ, యాక్సెసరీస్ వంటి వివిధ  కేటగిరిల్లోని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను   30 నిమిషాల్లో డెలివరీ చేస్తామని మింత్రా పేర్కొంది. ప్రస్తుతం  ఎం–నౌ కేవలం బెంగళూరులోనే అందుబాటులోకి వచ్చింది.

 దేశంలోని ఇతర మెట్రోలు, నాన్ మెట్రో సిటీలలో  విస్తరిస్తామని మింత్రా సీఈఓ నందితా సిన్హా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డొమెస్టిక్ ఫ్యాషన్ బ్రాండ్లను  కస్టమర్లకు 30 నిమిషాల్లో డెలివరీ చేస్తామని వివరించారు. ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్లలో పది వేలకు పైగా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆఫర్ చేస్తున్నామన్నారు.