ఆస్పత్రికి రూ.12 లక్షల సామగ్రి అందజేత

  • ఘనంగా ఎమ్మెల్యే పటేల్ ​బర్త్​డే

భైంసా, వెలుగు: ముథోల్​ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బర్త్​డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. భైంసాలోని ఎమ్మెల్యే నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. వంద మంది యువకులతో పాటు మహిళలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

స్థానిక ఏరియా హాస్పిటల్​లో రూ.12లక్షలతో వివిధ రకాల బెడ్స్, స్ట్రెక్చర్స్, కూర్చీలను ఆయన కుటుంబసభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తన సొంత ఖర్చులతో ఆస్పత్రికి సామగ్రి అందించినట్లు తెలిపారు. దాతల సహకారం తో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా హిందూవాహిని మాజీ జిల్లా అధ్యక్షుడు రావుల రాము అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్ష్యంలో బీజేపీలో చేరారు.