కోల్బెల్ట్, వెలుగు : రామకృష్ణాపూర్లోని విజయ గణపతి టెంపుల్లో సోమవారం అయ్యప్ప స్వాములకు ముస్లింలు అన్నదానం చేశారు. కాంగ్రెస్లీడర్, తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ ఎంఏ అబ్దుల్అజీజ్ ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతో కలిసిమెలిసి జీవనం కొనసాగించాలన్నారు.
ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ కమిటీ బాధ్యులు అఫ్జల్ లాడెన్, ఖాజా షరీఫ్, మోహిత్, షఫీ, ఖాజా భాయ్, మేరాజ్, ఖలీం, గౌస్ తహర్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.