ఆటోనగర్​లో మోర్ ​సూపర్ ​స్టోర్ తనిఖీ .. రూ.5 వేలు ఫైన్

మెదక్​టౌన్, వెలుగు: పట్టణంలోని ఆటోనగర్​లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్​లో మున్సిపల్​శానిటరీ ఇన్​స్పెక్టర్​మహేశ్​ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పాడైపోయిన యాపిల్ పండ్లను గుర్తించి రూ.5 వేలుజరిమానా విధించి నోటిస్ జారీ చేశారు.

ప్రజారోగ్యానికి హాని కలిగించే వాటిని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో వార్డ్ ఆఫీసర్లు నవీన్, శివ, మహబూబ్, దవులయ్య,రాజశేఖర్ పాల్గొన్నారు.