శుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు

  • మెదక్​లోని పలు షాప్​ల్లో మున్సిపల్​ అధికారుల తనిఖీలు 

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​పట్టణంలోని పలు షాపుల్లో మంగళవారం మున్సిపల్​అధికారులు తనిఖీలు చేశారు. శుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అపరిశుభ్రంగా ఉన్న పలు షాపుల యజమానులకు అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్  జానకి రామ్ సాగర్ మాట్లాడుతూ..

వర్షాకాలంలో రోగాలు సంభవించే అవకాశం ఉన్నందువలన తినుబంఢారాలు తయారు చేసే ప్రదేశాలు పొడిగా ఉండాలని సూచించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్​లు తీసివేయాలని తాగునీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇకనుంచి ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్​స్పెక్టర్​మహేశ్, జవాన్లు- శ్యాంసుందర్​, శ్రీనివాస్​, శేఖర్​, శ్రీను, కిరణ్, కిషన్, కృష్ణ, వెంకన్న  
పాల్గొన్నారు.

సిద్దిపేట రూరల్ : సిద్దిపేట పట్టణంలో ఫుడ్ ఇన్​స్పెక్టర్ అనూష అధ్వర్యంలో పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని విశాల్ మార్ట్ తో పాటు, పలు రెస్టారెంట్లలో ఎక్స్​పైరీ అయిన ఆహారపదార్ధాలను గుర్తించారు. టోల్గేట్ రెస్టారెంట్ లో  పాడైన కూరగాయలను గుర్తించారు. విశాల్ మార్ట్ లో ఎక్స్​పైరీ అయిన జీడిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్ ను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు.