సంగారెడ్డిలో రోడ్డుపై చెత్త వేసినందుకు రూ.10 వేలు ఫైన్

కంది, వెలుగు : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డుపై చెత్త వేస్తున్న ఓ వ్యక్తికి సంగారెడ్డి మున్సిపల్ ఆఫీసర్లు రూ.10 వేలు ఫైన్ వేశారు. స్వచ్ఛదనం –పచ్చదనం‌‌‌‌ కార్యక్రమంలో భాగంగా రోడ్డుపై చెత్త వేయకుండా మున్సిపల్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. 

అందులో భాగంగా బుధవారం ఉదయం సంగారెడ్డిలోని మెయిన్​రోడ్డుపై ఓ వ్యక్తి చెత్త  వేస్తుండగా ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ మనోజ్ మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడికి అక్కడికక్కడే రూ.10వేల ఫైన్ వేశారు. మరోసారి రోడ్డుపై చెత్త వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.