క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు : మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్

నిర్మల్, వెలుగు: రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా కారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువు ల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక లక్కీ క్రికెట్ అకాడమీలో స్కూల్ గేమ్స్ ఫెడరే షన్ అండర్-17 బాలుర క్రికెట్ సెలక్షన్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. 

క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండడం హర్షణీయమన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ రవీందర్ గౌడ్, స్కూల్ గేమ్స్ మాజీ సెక్రటరీ రమణారావు. కోచ్ సుదర్శన్, స్థానిక కౌన్సిలర్ గంధర్ రమణ తదితరులు పాల్గొన్నారు.