- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి. దేవేందర్
కోల్‌బెల్ట్,వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ఓసీపీలు, అండర్ గ్రౌండ్ మైన్లు, డిపార్ట్మెంట్లలో రక్షణ చర్యలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ అన్నారు. సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్‌లో మల్టీ డిపార్ట్మెంట్ మీటింగ్‌పై వివిధ విభాగాల ఆఫీసర్లు, కార్మిక సంఘం లీడర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, ముందున్న సవాళ్లు
టార్గెట్లను సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సమీక్ష జరిపారు. ఉద్యోగులు, కార్మికులు రక్షణపై దృష్టి సారించాకే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని జీఎం పేర్కొన్నారు. సమావేశంలో ఏస్వోటుజీఎం విజయ్‌ప్రసాద్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, కేకే గ్రూప్ ఏజెంట్ రాందాస్, డీజీఎంలు రాజన్న, ప్రసాద్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, గుర్తింపు సంఘం లీడర్లు తదితరులు పాల్గొన్నారు.