కోరం లేక  మండల మీటింగ్ ​వాయిదా

కౌడిపల్లి, వెలుగు: కోరం లేక మండల జనరల్ బాడీ మీటింగ్​వాయిదా వేసినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండల జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయగా 9 మంది ఎంపీటీసీలు, ఎంపీపీ ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. మీటింగ్​కు అన్ని శాఖల అధికారులు రావాల్సి ఉండగా వెటర్నరీ,  విద్యా, పంచాయతీరాజ్ శాఖ, రోడ్డు రవాణా శాఖ, మిషన్ భగీరథ అధికారులు హాజరు కాగా మిగతా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదన్నారు.

సర్వసభ్య సమావేశం మధ్యాన్నం రెండు గంటలకు నిర్వహించాల్సి ఉండగా గంటపాటు వేచి చూడగా విద్యుత్ శాఖ, శిశు సంక్షేమ శాఖ, ఉపాధి హామీ, ఆరోగ్య  శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు సమయపాలన పాటించకుండా సమావేశం ముగిసే సమయానికి వచ్చారన్నారు.