ఔను.. ఇది ఎంపీడీఓ ఆఫీసే..

కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ అధ్వానంగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈజీఎస్ స్టోర్ రూమ్​లోని రికార్డులన్నీ వర్షం నీటిలో తడిసిపోతున్నాయి. టాయ్​లెట్స్ చెత్తతో నిండిపోయి​ కంపుకొడుతున్నాయి. 

పోలింగ్ రోజున వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇచ్చిన సుమారు పది వీల్ చైర్స్ డ్యామేజ్​ అయిపో యాయి. స్లాబ్ ఉరుస్తూ గోడలు పెచ్చులూడుతున్నా మండల అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్​ను బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు.