బీఆర్ఎస్.. స్కీముల పేరుతో వేల కోట్ల స్కామ్లు చేసింది : ఎంపీ వంశీకృష్ణ

బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు దోపిడీ చేసిందని, స్కీమ్ ల పేరుతో స్కామ్ లు చేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. చెన్నూరు టౌన్ లో  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి పర్యటించారు. క్యాతాన్ పల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ లో 41 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పథకం లో భాగంగా నూతనంగా నిర్మించబోయే వాటర్ ట్యాంక్ పనులకు భూమి పూజ చేశారు.

ALSO READ | సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎంపీ గడ్డం వంశీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్లకు మేలు జరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలు త్రాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను చూశాం.. ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు త్రాగు నీళ్లే కావాలని అడిగారు. ఇవాళ అమృత్ పథకం కింద నీళ్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. త్వరలోనే చెన్నూరు లో రూ. 31 కోట్లతో ఇంటింటికి త్రాగు నీటిని ఇవ్వనున్నం. చెన్నూరు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి  చేస్తామని చెప్పారు వంశీకృష్ణ.