రైల్వే జీఎంతో ఎంపీ రఘునందన్​రావు భేటీ

హైదరాబాద్, వెలుగు: మెదక్ ఎంపీ రఘునందన్ రావు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్​తో గురువారం భేటీ అయ్యారు. జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆయా పనులను వేగవంతం చేయాలని కోరారు. పటాన్ చెరు– మెదక్ అండ్ అక్కన్నపేట రైల్వే లైన్ విస్తరణ, సిద్దిపేట–పెద్దపల్లి రైల్వే లైన్ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అజంతా ఎక్స్ ప్రెస్, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైళ్లను వడియారం, అక్కన్నపేట రైల్వే స్టేషన్ లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.