బీజేపీతోనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు : ఎంపీ నగేశ్​

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : బీజేపీతోనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం దివ్యగూడ, పొట్టాంలొద్ది, గుండంలొద్ది గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు.

గ్రామాల్లో రూ.1.2 కోట్ల నిధులతో నిర్మించనున్న రెండు మల్టీపర్పస్ కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రాబోయే నాలుగేండ్లలో గ్రామాల్లోని సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోశ్, దయాకర్, స్వామి, ముకుందరావు, రాజు, తుకారం తదితరులు పాల్గొన్నారు.