సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి-ఎంపీ గొడం నగేశ్

ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని ఎంపీ గొడం నగేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన దిశా మీటింగ్​లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్​తో కలిసి పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో జిల్లా అధికారుల పాత్ర కీలకమని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు అట్టడుగు స్థాయికి చేరేలా సామరస్యంగా పనిచేయాలని కోరారు. ఫారెస్ట్ శాఖలో పెండింగ్ ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 

పీఎం జన్​మన్ పథకం ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆయుష్మాన్ కార్డుల ద్వారా అందుతున్న చికిత్స, 108 అంబులెన్స్ సేవల స్థితిగతులపై ఎంపీ ఆరా తీశారు. నేషనల్ హైవేలపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయ, ఫారెస్ట్ ఆఫీసర్ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.