మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే శక్తి క్యాంటీన్లు

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని అందులో భాగంగానే మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఆదిలాబాద్​పట్టణంలోని ఓల్డ్​మున్సిపల్ ​కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్​ను బుధవారం కలెక్టర్​రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్​ జోగు ప్రేమేందర్​తో కలిసి ప్రారంభించారు. 

అనంతరం రిమ్స్​లో, పొచ్చర జలపాతం వద్ద కలెక్టర్,​ఎమ్మెల్యే అనిల్​జాదవ్​తో కలిసి క్యాంటీన్​ను ప్రారంభించారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్​ఖమర్​అహ్మద్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

జిల్లాలోని గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎంపీ నగేశ్​ఆకాంక్షించారు. ఆదిలాబాద్​పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడలను డీసీసీబీ చైర్మన్​అడ్డి భోజారెడ్డితో కలిసి ప్రారంభించారు. జీవితంలో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకుసాగాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 పాఠశాలకు సంబంధించిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని ప్రిన్సిపాల్ ​కీర్తి తెలిపారు. కార్యక్రమంలో ఆర్​సీవో రాథోడ్ గోపీచంద్, కౌన్సిలర్ పవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.