అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ మండలంలోని గిరిజన గ్రామాలైన పోతుగూడ, మొలల గుట్టలో పలు అభివృద్ధి పనులకు గురువారం ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ శ్రీకారం చుట్టారు. రూ.60 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లా డుతూ.. 

దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా మరో ఐదేండ్లలో గిరిజన ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.