పెద్దపల్లి గూడ్స్ ట్రైన్ ప్రమాదంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా

రాఘవపూర్ సమీపంలో మంగళవారం రాత్రి గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఎంపి ఆదేశించారు. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మార్గంలోని ఇతర ట్రైన్లలో ప్రయాణిస్తున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలుసుకొని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.