చినుకు పడితే రాకపోకలు బంద్

కోటపల్లి, వెలుగు: కోటపల్లి మండలంలోని లింగన్నపేట–పారుపల్లి గ్రామాల మధ్య వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. బురదలో ఎక్కడ చిక్కుకుపోతామోనని భయడిపోతున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య లో లెవల్ కల్వర్టు నిర్మిస్తుండడంతో వాహన రాకపోకలకు పక్క నుంచి తాత్కాలిక రోడ్డు వేశారు. కానీ రోడ్డు చినుకు పడితే బురదమయమవుతోంది. 

లింగన్న పేట, ఎదుల బంధం, సిర్సా, పుల్ల గామ, రొయ్యల పల్లి, ఆలుగామా, జనగామ, వెంచపల్లి, నంద్రం పల్లి, సూపాక గ్రామాలకు వెళ్లే వాహనదారులు బురదలోనే చిక్కుకుపోతున్నారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా ఆ తాత్కాలిక రోడ్డుపై కంకర వేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.