ప్రజలతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మార్నింగ్​ వాక్​

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ... చెన్నూరు మున్సిపాల్టీలోని పలు వార్డుల్లో ఈ రోజు ( అక్టోబర్​ 20) మార్నింగ్​ వాక్​ చేశారు.  ప్రజలతో కలిసి నడుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే  వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ కార్యకర్త పెండ్యాల శ్రీకాంత్​ తండ్రి మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.