మోడీ 3.0: బడ్జెట్ 2024-25.. రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో దేశం మొత్తం బడ్జెట్ వైపే ఆసక్తిగా చూస్తోంది. మరి కొద్దిసేపట్లో బడ్జెట్‌లో ముఖ్యమైన అంశాలు, కేటాయింపులు, ప్రభుత్వ లక్ష్యాలను పార్లమెంట్ లో దేశ ప్రజలకు వినిపించనున్నారు. బడ్జెట్ సమర్పణకు ముందు తన టీమ్‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులతో ఫోటోలు దిగారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లారు. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పార్లమెంట్ కు వచ్చి 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.