సంగారెడ్డిలో వారం రోజుల్లో 135 ఫోన్ల రికవరీ

సంగారెడ్డి టౌన్, వెలుగు: వారం రోజుల్లో 135 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ రూపేశ్​ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ ఆఫీసులో మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  ఈ ఏడాది జనవరి నుంచి  ఇప్పటివరకు సీఈఐఆర్​( సెంట్రల్​ఎక్విప్​మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్​) కింద 3501 దరఖాస్తులు రాగా 1604 ఫోన్లను గుర్తించి 941 సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు.

సైబర్ నేరాలకు గురైతే 1930 కి కాల్ చేయాల్సిందిగా సూచించారు.