న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఐపీఓ రెండో రోజు ముగిసే నాటికి 20.37 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రిటైల్, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. సుమారు 1.19 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా, 24.18 లక్షల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లు ఏకంగా 64.52 రెట్లు సబ్‌స్క్రయిబ్ అవ్వగా, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 30 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది.క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోసం కేటాయించిన షేర్లలో 84 శాతం షేర్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. మొబిక్విక్ సిస్టమ్స్ ఐపీఓ శుక్రవారంతో ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.265–279 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతోంది.
సాయి లైఫ్, విశాల్ మార్ట్ ఓకే
సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓ రెండో రోజు నాటికి 1.25 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. సుమారు 3.88 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా, 4.86 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కనిపించింది. ఈ కేటగిరీ 3.32 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రిటైల్, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కనిపించలేదు. సాయి లైఫ్ సైన్సెస్ షేర్లను రూ.522–549 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతున్నారు. మరోవైపు విశాల్ మార్ట్ కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ఇబ్బంది పడింది.
ఐపీఓ రెండో రోజు ముగిసే నాటికి 1.53 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. 75.68 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా, 115.75 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 3.80 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 1.16 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల పోర్షన్ మాత్రం 48 శాతమే సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఒక్కో షేరును రూ.74–78 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతున్నారు.