గ్రామాల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. మండలంలోని సుద్దాల, తుర్కపల్లి, కమ్మరేపల్లె, లింగంపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతూ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్డు వేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్.. వెంటనే గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే ఎమ్మెల్యే ఓకే చెప్పడంతో గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు.