పెద్దమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు

మెదక్​ టౌన్, వెలుగు: హవేలీ ఘనపూర్​ మండలంలోని రాజ్​పేట గ్రామంలో ముదిరాజ్​ కులస్తులు నిర్వహించిన పెద్దమ్మ తల్లి మూడో వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిచారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో హవేలీ ఘన్​పూర్​ఎంపీపీ నారాయణ రెడ్డి, ఎంపీటీసీలు దుర్గారావు, సిద్దిరెడ్డి, మాజీ సర్పంచ్​లు సాయాగౌడ్​, యామిరెడ్డి, మహిపాల్ రెడ్డి,  శ్రీను నాయక్,  సాయిలు, బీఆర్​ఎస్​ నాయకులు గోపాల్ రావు, పాండురంగారావు, బాబాగౌడ్, సయ్యద్ అలీ, ఆంజనేయులు, సంతోష్ గౌడ్,  ముదిరాజ్ సంఘం నాయకులు గోపాల్, కిషన్, రాములు, నల్లపోచయ్య, మొగులయ్య  తదితరులు పాల్గొన్నారు.