ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

కౌడిపల్లి, వెలుగు: మండల పరిధి నాగ్సాన్ పల్లి రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ 35వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం బోనాలు తీసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఈ ఉత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గుడి నిర్మాణదాత నాగ్సాన్​పల్లి మాజీ సర్పంచ్ అల్మాయిపేట ఎల్లం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, నవీన్, మహిపాల్ రెడ్డి, లింగం, కాంతారావు, శ్యాంసుందర్, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.