మంచిర్యాల జిల్లాలో ఒడ్డేపల్లి వాడ దగ్గర కొట్టుకుపోయిన కల్వర్టు మరమ్మత్తు పనులను చెన్నూరు ఎమ్మెల్యేవివేక్ వెంకటస్వామి పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోయింది. స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే కలెక్టర్ తో మాట్లాడి మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..కల్వర్టు పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో ముందుగా సైడ్ డ్రైయిన్, రోడ్లు వేసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో సుందరసాల గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయన్నారు. సెప్టెంబర్ 3 న ఉదయం పంట పోలాలను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎమ్మెల్యే వివేక్.