కల్వర్ట్ పేల్చింది.. ఎవరైనా సరే వదిలిపెట్టం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో ఇసుక, భూదందాలను బంద్ చేయించామన్నారు  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో   కల్వర్ట్ పేల్చి వేసి ఆందోళనకు గురి  చేసే  కుట్ర జరిగిందన్నారు.  కుట్రదారుల వెనుక ఉన్నది ఎవరైనా సరే వదిలేది లేదన్నారు. 

ALSO READ |చెన్నూరు​లో చెరువు మత్తడి పేల్చేసినోళ్లపై కఠిన చర్యలు :వివేక్ వెంకటస్వామి

కల్వర్ట్ పేల్చివేత వెనుక బీఆర్ఎస్,బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వివేక్. కుట్రలో ఉన్నారు కాబట్టే చెన్నూరు వదిలి పారిపోయారని విమర్శించారు. పేల్చివేత కుట్రదాలకు ఖచ్చితంగా శిక్ష తప్పదని హెచ్చరించారు.  ఎంతటి వారినైనా అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించానని చెప్పారు.   ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరుగుతోందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ అభివృద్ధి  చేస్తామన్నారు వివేక్.