చెన్నూరులో ప్రతి చోట అంబేద్కర్ విగ్రహాలు పెడతాం : వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి చోట అంబేద్కర్ విగ్రహాలు పెడతామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా జైపూర్ మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  ఇప్పటివరకు  సొంత డబ్బులతో 100 అంబేద్కర్ విగ్రహాలు స్థాపించానని చెప్పారు.  అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు  స్ఫూర్తి అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ను రోల్ మోడల్ గా తీసుకొని వారి సూచనలు పాటిస్తున్నారని తెలిపారు.

బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు వివేక్ వెంకటస్వామి. విద్య, క్రమశిక్షణతో పాటు మన  హక్కుల కోసం పోరాటం చేయాలని అంబేద్కర్ ఏనాడు పిలుపునిచ్చారో ఆ పిలుపును ఈరోజు అందరూ దళితులు చదువుకొని పైకి  వస్తున్నారని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల అంబేద్కర్ భవన్ లు కట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు వివేక్ వెంకటస్వామి.  జైపూర్ మండల కేంద్రంలో నేతకాలి భవన్  త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు