చెన్నూరు అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి

కోల్ బెల్ట్: చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఇందారంలో రోడ్లు, డ్రైనేజీల కోసం రూ.20 లక్షల ఫండ్స్ మంజూరు చేయాలని ఆదేశిం చినట్లు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక బోర్లు వేసి ప్రజల తాగునీటి వసతులను కల్పించినట్లు తెలిపారు. ట్రస్ట్ ద్వారా 20 బోర్ వెల్స్ వేశామన్నారు. డిసెంబర్లో గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక బోర్వెల్ ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ఏర్పా టుతో పాటు ఎల్లమ్మగుడి అభివృద్ధికి కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారిస్తూ ని యోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిచేసేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు

కోనేరు వీరభద్ర రావు ఆదర్శప్రాయుడు

సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రముఖ వ్యాపా రవేత్త కోనేరు వీరభద్ర రావు అందరికీ ఆద ర్శప్రాయుడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెం కటస్వామి అన్నారు. మందమర్రి సింగరేణి ఇల్లందు క్లబ్ లో దివంగత కోనేరు వీరభద్ర రావు ఫొటోకు పూలమాలవేసి నివాళుల అర్పించి.. ప్రసాద్ బాబు కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బోడ జనార్దన్, సొత్కు సంజీవరావు తదితరులు పాల్గొ న్నారు.

ALSO READ | ఎమ్మెల్యే వివేక్​ సమక్షంలో  కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ కౌన్సిలర్