- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు వీరభద్ర రావు అందరికీ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మందమర్రి సింగరేణి ఇల్లందు క్లబ్ లో జరిగిన వీరభద్రరావు సంతాప సభకు హాజరై ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
వీరభద్రరావు కొడుకు ప్రసాద్‌బాబుతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బోడ జనార్ధన్, సొత్కు సంజీవరావు, సింగరేణి మాజీ డైరెక్టర్లు, జీఎంలు, ఆఫీసర్లు, వివిధ రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
ఆదివారం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మార్నింగ్ వాక్ సందర్భంగా పలువురు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. జైపూర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ సిద్ధం చంద్రయ్య, ఇందారం గ్రామానికి చెందిన నులిగొండ సుజాత, క్యాతనపల్లి మున్సిపాలిటీ కుర్మపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు బైరి శ్రీనివాస్ ఇటీవల చనిపోగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శిం చారు.
ఆయన వెంట కాంగ్రెస్ లీడర్లు పల్లె రాజు, రాఘునాథ్‌రెడ్డి, గోపతి రాజయ్య, ఎండీ అబ్దుల్అజీజ్, బండి సదానందం యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు పనాస రాజు, పోలం సత్యనారాయణ, జైపూర్మండల కాంగ్రెస్ప్రెసిడెంట్ఫయాజ్, జిల్లా సెక్రటరీ రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, పలువురు లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు
పాల్గొన్నారు.