అంబేద్కర్ అందరికి రోల్ మోడల్

  • జైపూర్‌‌లో అంబేద్కర్, కాకా వెంకటస్వామి 
  • విగ్రహాల ఏర్పాటుకు వివేక్‌‌ వెంకటస్వామి భూమి పూజ

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: బలహీన వర్గాలకు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్​అంబేద్కర్ ​స్ఫూర్తిదాత అని, ఆయనను రోల్ మోడల్‌‌గా తీసుకొని ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జైపూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహాల ఏర్పాటు, అంబేద్కర్ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జైపూర్ మండలంలోని ఎల్కంటి, గంగిపల్లి, షెట్‌‌పల్లి గ్రామాల్లో రూ.1.27 కోట్ల డీఎంఎఫ్‌‌టీ ఫండ్స్‌‌తో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కుందారం హైస్కూల్ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

 అనంతరం వివేక్ మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహాలను పెట్టిస్తానని, అంబేద్కర్ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సొంత డబ్బులతో 100 అంబేద్కర్ విగ్రహాలను అందజేశానన్నారు. దళితులు చదువుకొని పైకి వస్తున్నారంటే దానికి అంబేద్కర్ స్ఫూర్తే కారణమన్నారు. చెన్నూరులో నేతకాని భవన్ ఏర్పాటుకు ల్యాండ్ కేటాయింపు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

 ఈ సందర్భంగా గ్రామస్తులు, దళిత సంఘాలు వివేక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌డీఈ విద్యాసాగర్, జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఫయజొద్దిన్, కాంగ్రెస్‌‌ లీడర్లు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,చల్లా సత్యనారాయణరెడ్డి, విశ్వంభర్ రెడ్డి, శీలం వెంకటేష్, గుడెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నం వెంకన్న, కిరణ్ గౌడ్, తిరుపతి రాజ్, రామారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.