కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది : వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం  7 లక్షల కోట్లకు పైగా అప్పుచేసి ఖజానా మొత్తం ఖాళీ చేసిందన్నారు. గత  బీఆర్ఎస్  సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.  ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలను పక్కాగా అమలు చేశామని చెప్పారు.  ఉచిత బస్సు సౌకర్యానికి నెలకు రూ.300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు. 

రెండు లక్షలకు పైగా ఉన్న  రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు వివేక్ వెంకటస్వామి.  గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే వారు..కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు ఉండబోవన్నారు.  చెన్నూరు టౌన్ లో 10 కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు వివేక్.

నేషనల్ హైవే 63లో భీమరం మండలం జోడు వాగుల దగ్గర రూ.  1.80కోట్లతో చేపట్టనున్న రోడ్డు మరమ్మతులకు శంకుస్థాపన చేశారు వివేక్ వెంకటస్వామి. తాను ఎంపీగా ఉన్నపుడు నేషనల్ హైవే జోడు వాగుల దగ్గర  రూ.15 కోట్లతో రోడ్డు అభివృద్ధి, రిపీర్లు చేయించానని చెప్పారు. 10 ఏండ్లలో బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే రోడ్డు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కనీసం రిపేర్లు కూడా చేయించలేదన్నారు. రూ.100 కోట్ల నిధులతో కొత్తగా ఫోర్ వే లైన్ మంజూరు చేయించాం..కానీ టెక్నీకల్ సమస్య తో ఇంకా టెండర్ ప్రకీయ పూర్తి కాలేదన్నారు వివేక్. త్వరలో ఫోర్ వే రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు వివేక్.

రేవంత్ సర్కార్ టాప్

సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడంలో రేవంత్ సర్కార్ టాప్ అని అన్నారు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. భీమారం మండల కేంద్రంలో 24 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచిస్తుందన్నారు.  గత ప్రభుత్వం 5 ఏళ్లలో మొత్తం రూ.2400 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదల చేస్తే .. రేవంత్ రెడ్డి సర్కారు కేవలం ఒక్క ఏడాదిలోనే రూ.830 కోట్లు విడుదల చేయటం గొప్ప విషయమన్నారు.  పేద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు.