మాలల అభివృద్ధే ముఖ్యం..ఐక్యతతోనే మాలలు తమ హక్కులు సాధించుకోవాలి : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

  • 30 లక్షల జనాభాతో రాష్ట్రంలో రెండో స్థానంలోఉన్నామని వెల్లడి 
  • పిల్లి సుధాకర్‌‌‌‌‌‌‌‌కు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

జైపూర్/కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నా.. రాజకీయ పార్టీలు మాత్రం మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. తనకు మాలల అభివృద్ధే ముఖ్యమని, ఐక్యతతోనే మాలల హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌‌‌‌ భద్రాచలం నుంచి చేపట్టిన పాదయాత్ర బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం చేరుకుంది.

అక్కడ నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలలు ఐక్యంగా ఉండి, మనల్ని తక్కువ చూపుతున్న లీడర్లకు మన సంఖ్య ఎంతుందో చూపాలన్నారు. ఇగోను పక్కన బెట్టాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో రెండో స్థానంలో ఉన్నా మాలలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీ సమయం నుంచి మాలలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చిందన్నారు.

వచ్చే నెల 1న హైదరాబాద్‌‌‌‌లో జరిగే మాలల బహిరంగ సభను సక్సెస్‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు పిల్లి సుధాకర్‌‌‌‌ చేపట్టిన యాత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి కాకా వెంకటస్వామిని గుర్తించారన్నారు. విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ను నడిపిస్తూ ఎక్కడా అవినీతికి పాల్పడకుండా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్స్‌‌‌‌ చెల్లిస్తున్న తమపై కొందరు ఫేక్‌‌‌‌ వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం వివేక్ వెంకటస్వామిని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి లక్ష్మణ్ సన్మానించారు.

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ..

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీపై దృష్టి పెట్టిందని వివేక్ వెంకటస్వామి అన్నారు. కలెక్టర్ కుమార్‌‌‌‌ దీపక్‌‌‌‌, మత్స్య శాఖ అధికారి సాంబ శివరావు, కాంగ్రెస్ నాయకులతో కలిసి భీమారంలోని గొల్లవాగు ప్రాజెక్ట్‌‌‌‌లో చేప పిల్లలను వదిలారు. చెన్నూరు భీమారం రైతు వేదిక, చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

క్యాంప్‌‌‌‌ ఆఫీసులో సీఎం రిలీఫ్‌‌‌‌ ఫండ్‌‌‌‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. చెన్నూరులోని డిగ్రీ కాలేజీని సందర్శించారు. తర్వాత మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కుటుంబ సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ కుమార్‌‌‌‌ దీపక్‌‌‌‌, ఆఫీసర్లు, కాంగ్రెస్‌‌‌‌ నాయకులు ఉన్నారు.