మందమర్రిలో ఎమ్మెల్యే వివేక్ మార్నింగ్ వాక్... సమస్యలపై ఆరా

మందమర్రి మున్సిపాలిటీ లోని ఊరు మందమర్రి,ఎర్రగుంట పల్లె గ్రామాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో లో పాల్గొన్నారు.పలు కాలనీల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మున్సిపాలిటీలోని 24 వార్డులో ఏళ్ల తరబడి రోడ్లు,డ్రైనేజీలు,త్రాగునీరు సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మందమర్రి వాగు పై బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే. మందమర్రిలో పందుల సంచారం తో ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు ఎమ్మెల్యే.పశు వైద్యశాలలో మందుల కొరతపై సంబంధిత డాక్టర్ తో ఫోన్లో మాట్లాడి పశువులకు కావలసిన మందులను మందులు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. 

నార్లపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త బొలిశెట్టి రాధ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామకృష్ణాపూర్ లో కాంగ్రెస్ మైనార్టీ ప్రెసిడెంట్ లాడెన్ సోదరుడు నయ్యిమ్ మృతి చెందగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.