చెన్నూరు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • మున్సిపాలిటీ మూడో వార్డులో కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో  రూ.12 లక్షలు మంజూరు 

చెన్నూరు, వెలుగు: చెన్నూరు పట్టణంలోని మూడో వార్డులో నాలా, కల్వర్టు పనులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు.  డీఎంఎఫ్టీ నిధులతో రూ. 12 లక్షలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంజూరు చేశారని వారు పేర్కొన్నారు.  బేతాళ వాడ, మారెమ్మవాడ ల్లో  కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.  గత ప్రభుత్వంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల మున్సిపాలిటీలో రోడ్లు, నాలాలు, అస్తవ్యస్థంగా మారాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ లో పట్టణంలోని వాడవాడలు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ  ఆధ్వర్యంలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీ గా తీర్చి దిద్దుతామన్నారు.  కాంగ్రెస్ నాయకులు సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, కొంపెల్లి బానేశ్, చెన్న వెంకటేశ్వర్, అంబటి శంకర్,గిరెల్లి మల్లన్న, సాయినీ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.