ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన

  • బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం..
  • బాల్క సుమన్​బేషరతుగా సారీ చెప్పాలె
  • రాజకీయ మనగుడ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తుండు 

కోల్ బెల్ట్: బాల్క సుమన్ ​అధికారం కోల్పోయి, ఓర్వలేక రాజకీయ మనగుడ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీపీ మహంకాళీ శ్రీనివాస్​, నాయకులు మహేశ్​, పైడిమల్ల నర్సింగ్​ ఆరోపించారు. ఇవాళ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనుచితవ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ  మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్  దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..   బాల్క సుమన్​ ఎమ్మెల్యే గా ఉండి చెన్నూరు నియోజకవర్గం అన్ని విధాల నష్టపోయిందని,  ఎక్కడ కూడా అభివృద్ధి జరుగలేదన్నారు.  బాల్క సుమన్ అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు దందా, ఇసుక దందా, భూదందలతో కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని జైలుకు పంపిస్తామనిమతిభ్రమించి మాట్లాడుతున్నాడని తెలిపారు.

ALSO READ | డంపుయార్డ్‌‌‌‌‌‌‌‌ స్థలం పరిశీలించిన సింగరేణి జీఎం

ఇటీవల చెన్నూరు శని కుంట చెరువు బాంబు బ్లాస్టింగ్ పేలుళ్ల వల్ల  టిఆర్ఎస్ నాయకులు జైల్లోకి వెళ్లిన విషయం ప్రజలు మరచిపోరన్నారు.   ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీకృష్ణ  చొరవతో  చెన్నూరు నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.  ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి  ఒక్క రూపాయి కూడా అవినీతి చేయాల్సిన  అవసరం లేదన్నారు.  పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న కాకా కుటుంబంపై ఆరోపణలు చేస్తూ ఊరుకోమన్నారు.  పదవులతో సంబంధం లేకుండా  విశాక ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న కాకా కుటుంబంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.  బాల్క సుమన్​ తప్పుడు ఆరోపణలు మానుకోని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.