వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

మందమర్రి, వెలుగు : మంచిర్యాల జిల్లాలో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పలువురు వధూవరులను ఆశీర్వదించారు. మందమర్రిలోని సాయి మిత్ర గార్డెన్స్​లో జరిగిన నవీన్ కుమారాచార్యులు–లక్ష్మీ ప్రసన్న వివాహానికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి హాజరయ్యారు. 

జైపూర్ మండలం కిష్టాపూర్​లో వధూవరులు రామగిరి అజయ్–మనస్వినిని వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. జైపూర్ మండలం కుందారంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్​ను ఎమ్మెల్యే ప్రారంభిం చారు. జైపూర్ మండలం ఇందారంలో బెదా సతీశ్ గృహప్రవేశానికి హాజరయ్యారు.

బాధిత కుటుంబానికి పరిహారం అందజేత

 కోటపల్లి మండలం నక్కలపల్లిలో రెడ్డి రాములు విద్యుత్ షాక్ తో చనిపోగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారంగా రూ.5 లక్షల చెక్కును మృతుడి భార్య రెడ్డి శారదకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ అందజేశారు.