సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ను కలిసిన ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు

  • ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ​ ఆధ్వర్యంలో భేటీ
  • తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి

కోల్​బెల్ట్, వెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గృహ నిర్మాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ను కలిసి, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1,179 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 2016 వరకు పని చేశారని, అప్పటి సీఎం కేసీఆర్ ఇతర శాఖలకు బదిలీ చేస్తూ తమను సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు.

కాంగ్రెస్ సర్కార్ తమను తిరిగి విధుల్లోకి తీసుకోని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును ఉద్యోగులు సైతం కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సంఘం లీడర్లు మద్దూరి రాజుయాదవ్​, కుమారస్వామి, సతీశ్, సాగర్, ఏఈలు, వర్క్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు, ​డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.