వెంటనే ఇంటింటికి నీరు అందించండి.. అధికారులకు ఎమ్మెల్యే వివేక్ ఆదేశం

చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేసి.. ఇంటింటికి శుద్ధ నీటిని అందించాలని అధికారులను స్థానిక వివేక్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే వివేక్ ఇవాళ (సెప్టెంబర్ 28, 2024) నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై ఆరా తీసిన వివేక్.. వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని అధికారును ఆదేశించారు. విద్యాశాఖలో పెండింగ్‎లో ఉన్న పనులను వెంటనే పరిష్కరించాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ALSO READ | త్వరలో చెన్నూర్లో 100 పడకల హాస్పిటల్: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి