ఆగష్టు 7న పిప్రి గ్రామానికి డిప్యూటీ సీఎం రాక

  • అభివృద్ధి పనులకు శ్రీకారం

బజార్​హత్నూర్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా బజార్​హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి ఈనెల 7న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ, బోథ్ నియోజకవర్గ పార్టీ ఇన్​చార్జ్ ఆడే గజేందర్​తో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్​లో ఎమ్మెల్యే మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బట్టి విక్రమార్క పిప్రి గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ చేపట్టి ఖమ్మం జిల్లా వరకు చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారని ఇచ్చిన మాటకు కట్టుబడి 7వ తేదీన పిప్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చేయనున్నట్లు చెప్పారు.

పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ జడ్పీటీసీ మల్లెపూలు నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడ  పాండురంగ్, నాయకులు దేవేందర్, విఠల్, కిషన్, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.