మా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోం : సునీతారెడ్డి

కొల్చారం, వెలుగు: బీఆర్ఎస్​ను వదిలి కాంగ్రెస్​లో చేరిన నాయకులు మిగతా బీఆర్ఎస్​కార్యకర్తల వద్దకు వచ్చి పార్టీ మారాలని బెదిరించడం సరికాదని ఎమ్మెల్యే సనీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం కొంగోడు, జలాల్​పూర్​, పోతిరెడ్డిపల్లి, తదితర గ్రామాల్లో ఆమె బీఆర్​ఎస్​ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం చిన్న ఘన్​పూర్ ఐబీ దగ్గర మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

పార్టీ మారినవాళ్లు మర్యాదగా ఉండాలని,  ఎవరి పార్టీ కార్యక్రమాలు వారు చేసుకోవాలని కార్యకర్తలను భయపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. వెంకట్రామిరెడ్డికి గ్రామాల్లో అనూహ్య స్పందన వస్తోందని ఆయన భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్​ఐదు గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో  ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ గౌరవశంకర్, సంతోష్​రావు, నరేందర్​రెడ్డి, శ్రీనివాస్​ రెడ్డి, రమేశ్, యాదయ్య, ఇంద్రసేనారెడ్డి, నాయకులు వేమారెడ్డి, రాజాగౌడ్, సోమ నర్సింలు పాల్గొన్నారు.