కౌడిపల్లి, వెలుగు: అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి పేర్కొన్నారు. గురువారం కౌడిపల్లి మండలంలోని ధర్మసాగర్, సదాశివ పల్లి, కంచన్ పల్లి, రాయిలాపూర్ తో పాటు పలు గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.
ప్రజలను మభ్యపెట్టడమే కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. బీజేపీ రాముడి పేరుతో, కాంగ్రెస్ కులం పేరుతో ప్రచారం చేస్తుందన్నారు. ప్రజాసమస్యలపై అవగాహన లేని కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామాగౌడ్, నవీన్ గుప్తా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, మహేశ్ గౌడ్, మల్లేశం, మహిపాల్ రెడ్డి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సంజీవ్ పాల్గొన్నారు.