కమ్యూనిటి బిల్డింగ్​లను సద్వినియోగం చేసుకోవాలి : సునీతా లక్ష్మారెడ్డి 

కౌడిపల్లి, వెలుగు:   గ్రామాల్లో కమ్యూనిటీ బిల్డింగ్​లను ఉపయోగించుకోవాలని  నర్సపూర్​ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపూర్ లో   గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ లను ఆమె  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘ సమావేశాల, ఇతర కార్యకలాపాల నిర్వహణ కోసం  ఈ బిల్డింగ్​లను నిర్మిస్తున్నట్టు తెలిపారు.

 గ్రామంలో కొత్తగా నిర్మించిన దేవాలయాలకు తనవంతు సహాయం చేస్తానని చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ మెంబర్​  కవిత, ఎంపీటీసీ  స్వప్న,  మాజీ సర్పంచ్ పద్మ కిష్టయ్య, జడ్పీ కోఆప్షన్ మెంబర్​ మన్సూర్, మండల బీఆర్ఎస్  అధ్యక్షుడు రామగౌడ్ పాల్గొన్నారు.