చివరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, వెలుగు: చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించి రైతు కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్​అన్నారు. భైంసాలోని గడ్డెన్న ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని గురువారం విడుదల చేశారు. ఈ రబీ సీజన్​లో 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రధాన కాలువ రిపేర్లు తదితర పనులకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకవచ్చి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. 

రైతు సాగునీటిని సద్వినియోగం చేసుకోని పంటలను సమృద్ధిగా పండించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డీఈఈ అనిల్, ఏఈఈ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు సోలంకి భీంరావు, రమేశ్, రావుల పోశెట్టి, దిలీప్, వడ్నప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.