కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రామారావు పటేల్

ముధోల్, వెలుగు : రైతులు వరి   కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే  రామారావు పటేల్ అన్నా రు. సోమవారం ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. 

క్వింటాల్ ఏ గ్రేడ్ వరి రకం ధాన్యానికి రూ.2320, బి గ్రేడ్ క్వింటాల్ వరి రకం ధాన్యానికి రూ2300 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు ప్రైవేటు వ్యాపారుల దగ్గరకు వెళ్లి నష్టపోకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్​  చైర్మన్ తీగల వెంకటేశ్​గౌడ్,  మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ  జడ్పీటీసీ నర్సా గౌడ్ పాల్గొన్నారు.